వేధింపుల ఆకతాయిలను చితకబాదిన అక్కాచెల్లెళ్లు
బస్సులో కళాశాలకు వెళ్తుంటే వేధించిన ఇద్దరు ఆకతాయిలకు ఉత్తరప్రదేశ్ లో అక్కాచెల్లెళ్లు భలే బుద్ధి చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని షామ్లి జిల్లా కంద్లా పట్టణంలో బస్సులో కళాశాలకు వెళ్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను కల్పిత్ కుమార్, సామ్రాట్ అనే ఇద్దరు ఆకతాయి యువకులు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆగ్రహించిన అక్కాచెల్లెళ్లు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. గత నెలలో హర్యానాలోని రోహ్ తక్ లో బస్సులో వేధింపులకు పాల్పడిన యువకుల్ని ఇద్దరు అక్కాచెల్లెళ్లు చితకబాదిన సంగతి తెలిసిందే.